రాహుల్ గాంధీవన్నీ గాలి మాటలే: బండి సంజయ్
TG: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పేవన్నీ గాలి మాటలేనని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని చెప్పడం పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. 6 గ్యారంటీలు గాలి మూటలుగానే మిగిలిపోయాయని, ఆరోగ్య శ్రీకి నిధులివ్వడం లేదని, ఉద్యోగులకు ఆరోగ్య భద్రత లేదని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతినెలా గిగ్ వర్కర్లకు భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
