రైలును తోసిన ప్రయాణికులు

బిహార్లో ప్రయాణికులు రైలును తోసుకుంటూ వెళ్లిన వీడియో వైరల్ అవుతోంది. రెండ్రోజుల క్రితం పట్నా-ఝార్ఖండ్ ప్యాసింజర్ రైలులో అగ్నిప్రమాదం సంభవించింది. స్పందించిన అధికారులు మంటలు వ్యాపించిన బోగీలను మిగతా బోగీలతో విడదీశారు. ఆ వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు మిగతా బోగీలను ముందుకు తోసి మంటలు అంటుకోకుండా చేశారు. కియుల్ జంక్షన్లో ఈ ఘటన జరగ్గా ఆ వీడియోను నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో షేర్ చేస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *