- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ప్రమాణస్వీకారం చేయించిన ప్రొటెం స్పీకర్
• సభలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పరస్పర ఆలింగనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ శాసనసభ్యుడిగా ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ప్రమాణం చేయించారు. సభ ప్రారంభం కాగానే గౌరవ స్పీకర్ సభ్యులందరికీ సభా సంప్రదాయాలు వివరించి ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. మొదట ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని స్పీకర్ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసేందుకు లేచి నిలబడగానే సభలో ఉన్న సభ్యులంతా గౌరవ సూచకంగా నిలబడి కరతాళధ్వనులతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విధేయుడిగా ఉంటూ విధులు నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రొటెం స్పీకర్ శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో రిజిస్టర్ లో సంతకాలు స్వీకరించారు.
సభలోకి అడుగుపెట్టగానే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు
గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు శాసనసభ్యులుగా ప్రమాణస్వీకారం చేయించారు