48 గంటల్లో నిందితులను అరెస్టు చేస్తాం: హోంమంత్రి

AP: బాపట్ల జిల్లాలో 21 ఏళ్ల యువతిపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను 48 గంటల్లోగా అరెస్టు చేస్తామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చెక్కును అందజేశారు. ఈ కేసుపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని చెప్పారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అరికట్టేందుకు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. అటు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు డీజీపీ నుంచి వివరాలు తెలుసుకున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *