మద్యం మత్తులో వ్యక్తి హంగామా

మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తాలో సోమవారం మద్యం మత్తులో ఒక వ్యక్తి హంగామా చేశాడు. ఫుల్గా తాగి రోడ్డుపై పడుకొని తాను చనిపోతానని పైన వాహనాలు ఎక్కించండని ఇబ్బందులకు గురి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బ్లూ కోల్ట్ కానిస్టేబుల్ సత్యనారాయణ వెంటనే అక్కడికి చేరుకొని ఆ వ్యక్తిని పక్కకు తీసుకొచ్చి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. అనంతరం అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి పోలీస్టేషన్కు తరలించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *