మహాచండీ దేవిగా అమ్మవారు.. దర్శిస్తే విజయం తథ్యం
శరన్నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజు విజయవాడ దుర్గమ్మ శ్రీ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా పూజలందుకుంటున్నారు. దుష్టశిక్షణ, శిష్ట రక్షణకు ప్రతీకగా వెలసిన మహాచండీని ఆరాధిస్తే విద్య, సంపద, శ్రేయస్సు, విజయం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. అటు బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారు, ఏడుపాయల వన దుర్గాభవానీ కూష్మాండ అవతారంలో అభయమిస్తున్నారు.
