కర్నూలు జడ్పీ ఛైర్మన్ రేసులో కేఈ కుమారుడు!
కర్నూలు జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవిని ఆశిస్తున్న వారిలో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కుమారుడు కేఈ రుద్రఫణి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉలిగయ్య, హౌసింగ్ డైరెక్టర్ రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్య దర్శి నాగరాజు యాదవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కర్నూలు జిల్లా మంత్రులు, ముఖ్య నేతలను కలిసేందుకు రాజధానిలో మకాం వేశారు.
