AP: మన్యం దేవతగా విరాజిల్లుతున్న మోదకొండమ్మ ఉత్సవాలు పాడేరులో ప్రారంభమయ్యాయి. ఇవాళ తెల్లవారుజామున అమ్మవారి పాదాలు, ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి శతకంపట్టు వద్ద కొలువుదీర్చారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. భక్తులు పెద్దఎత్తున రానుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని రాష్ట్ర గిరిజన జాతరగా గుర్తించింది.
మోదకొండమ్మ ఉత్సవాలు ప్రారంభం

09
Jun