అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం

ఈ రోజు “అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం ” సందర్బంగా… అనంతపురం జిల్లా కేంద్రంలో Indian Red Cross Society ఆధ్వర్యంలో…
జిల్లా వ్యాప్తంగా రక్తదానంపై అవగాహన కల్పించి,రక్తదాన శిభిరాలు నిర్వహించిన వ్యక్తులు,సంస్థలకు జిల్లా కలెక్టర్ డా:B.వినోద్ కుమార్ గారి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు.
ఈ సందర్బంగా…
ఆంధ్రప్రదేశ్,తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలో అనేకమంది రోగులకు రక్తం ఏర్పాటు చేయడంతో పాటు రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేయడం అలాగే రక్తదాన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఇలా అనునిత్యం రక్తదానంపై పనిచేస్తున్న “దుర్గం రక్తదాతలు”సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు Lion:శ్రీ. కంబాల తిమ్మారెడ్డి గారిని కలెక్టర్ డా:శ్రీ B.వినోద్ కుమార్ గారు మరియు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మెన్ శ్రీమతి:కాపు.భారతి గారి చేతుల మీదుగా ఉత్తమ రక్తదాన సేవకుడు అవార్డును ప్రధానం చేయడం జరిగింది.
అవార్డుల ప్రధానోత్సవం తర్వాత నిర్వహించిన రక్తదాన శిభిరంలో పలువురు రక్తదానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో….
డా:శ్రీ B. వినోద్ కుమార్(IAS) గారు
(జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు)
శ్రీమతి:కాపు భారతి గారు
(జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్)
శ్రీ.Y.మేఘా స్వరూప్(IAS)గారు
(మున్సిపల్ కమీషనర్-అనంతపురం)
కుమారి:వైఖోమ్ నైదియా దేవి(IAS)గారు
(Chief Excutive Officer,ZP-అనంతపురం)
శ్రీ కాపు రామచంద్రా రెడ్డి గారు
(ముఖ్య అతిథి రాష్ట్ర మేనేజంగ్ కమిటీ మెంబర్ IRCS & రాయదుర్గం మాజీ MLA)
(DM&HO,అనంతపురం)
శ్రీ.మోహన్ కృష్ణ గారు
(సెక్రటరీ-ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,అనంతపురం)
శ్రీ.ఆలంబన జనార్ధన్ గారు
జిల్లా నలుమూలల నుండి వచ్చిన రక్తదాన సేవకులు,స్వచ్చoద సంస్థలు,అధికారులు,వైద్యులు మరియు రక్తనిధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *