ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణం పూర్తి

ప్రకృతి సోయగాల జమ్ముకశ్మీర్ సిగలో మరో మణిహారం చేరనుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణం పూర్తయింది. చీనాబ్ నదిపై దీనిని నిర్మించారు. ఈ వంతెన ద్వారా రాంబన్ నుంచి రియాసికి త్వరలో రైలు సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఉత్తర రైల్వే శాఖ తెలిపింది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో ఇది భాగం. చీనాబ్ నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ వంతెన పొడవు 1315 మీటర్లు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *