PM మోదీ డిగ్రీ సమాచారాన్ని బహిర్గతం చేయాలని కేంద్ర సమాచార కమిషన్(CIC) ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఆ వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది. తాను ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 1978లో BA పాసైనట్లు గతంలో మోదీ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనగా, ఆ వివరాల కోసం ఓ వ్యక్తి RTI దాఖలు చేశారు.
ఈ వివరాలు ఇవ్వాలని CIC ఆదేశాలు జారీ చేయగా, వాటిని ఢిల్లీ వర్సిటీ కోర్టులో సవాల్ చేసింది.