AP: జనసేన బలోపేతంపై ఆ పార్టీ చీఫ్, Dy.CM పవన్ కళ్యాణ్ దృష్టిసారించారు. ఇందులో భాగంగా నామినేటెడ్ పదవులు పొందిన నేతలతో ఈ నెల 22న విస్తృత సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు. ‘పదవి-బాధ్యత’ పేరుతో మంగళగిరిలో జరిగే ఈ భేటీలో నాయకులకు ఆయన దిశానిర్దేశం చేస్తారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, MLAలు, MLCలు, MPలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, జిల్లా స్థాయి పదవుల్లో ఉన్నవారు హాజరుకావాలని ఆదేశించారు.
22న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం
19
Dec