IPL ట్రోఫీని గమనిస్తే విజేత పేరుతో పాటు సంస్కృతంలో ‘యత్ర ప్రతిభా అవసర ప్రాప్నోతిహి’ అని రాసిన శ్లోకం కనిపిస్తుంది. ‘ఎక్కడైతే ప్రతిభకు తగిన అవకాశం లభిస్తుందో’ అని దీని అర్థం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యంగ్ క్రికెటర్ల ప్రతిభను గుర్తించి, వారికి సరైన వేదికను అందించడమే ఈ టోర్నీ ఉద్దేశమని నిర్వాహకులు ఈ విధంగా చాటిచెప్పారు. నిన్న పాటీదార్ సేన గెలుపొందడంతో ట్రోఫీపై RCB పేరును సువర్ణాక్షరాలతో లిఖించారు.
01
Jun