TG: 2024 ఎన్నికల తర్వాత ఇండీ కూటమికి మద్దతు ఇవ్వాలంటూ తాను AP CM చంద్రబాబును సంప్రదించినట్లు జరిగిన ప్రచారం అవాస్తవమని CM రేవంత్ తెలిపారు. రాహుల్ గాంధీ అలాంటి రాజకీయాలను ఇష్టపడరని, తానెప్పుడూ ఆ ప్రయత్నం చేయలేదని ఇండియా టుడే పాడ్కాస్ట్లో స్పష్టం చేశారు. ‘చంద్రబాబు సీనియర్ పొలిటీషియన్. గతంలోనూ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. రాజకీయ ఎత్తుగడల్లో ఆయన్ను మించినవారు లేరు’ అని పేర్కొన్నారు.
చంద్రబాబును సంప్రదించలేదు: సీఎం రేవంత్
02
Sep