AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు భక్తులు కానుకల వర్షం కురిపించారు. గత 31 రోజులుగా ఆలయంలోని అన్ని హుండీల్లో వేసిన కానుకలను అధికారులు నిన్న లెక్కించారు. రూ.4.57 కోట్ల నగదు, 400 గ్రాముల బంగారం, 7.6 కేజీల వెండి వచ్చినట్లు తెలిపారు. US, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దుబాయ్ తదితర దేశాల కరెన్సీని కూడా భక్తులు అమ్మవారికి సమర్పించారు.
కనక దుర్గమ్మకు కానుకల వర్షం
06
Sep