AP: మూడేళ్ల కూతురిని ఓ తండ్రి రూ.5వేలకు అమ్మేసిన ఘటన విజయవాడలో జరిగింది. బాపట్ల(D) వేటపాలెంకు చెందిన మస్తాన్ గురువారం రాత్రి విజయవాడ బస్టాండ్ వద్ద పరిచయమైన మహిళ, పురుషుడికి తన కుమార్తెను విక్రయించాడు. ఆపై తప్పిపోయిందని కిడ్నాప్ డ్రామా ఆడాడు. కృష్ణలంక పోలీసులు CC కెమెరాలు పరిశీలించగా అసలు విషయం బయటపడింది. బాలికను విశాఖ తీసుకెళుతున్నట్లు గుర్తించి రక్షించారు. ఆపై పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.
రూ.5వేలకు కూతురిని అమ్మేసిన తండ్రి.. పట్టించిన CC కెమెరాలు
13
Aug