బిహార్ ఓటరు జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది పేర్లను జిల్లాల వారీగా ప్రకటించాలని ECని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఓటర్ల తొలగింపునకు గల కారణాలను వెల్లడించాలని సూచించింది. జిల్లాలు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఈ వివరాలను ఉంచాలని, దీనిపై వార్తా పత్రికలు, రేడియో, SMలో ప్రకటనలు ఇవ్వాలని పేర్కొంది. AUG 19లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను AUG 22కి వాయిదా వేసింది.
బిహార్ ఓటరు లిస్టుపై ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు
15
Aug