జమ్మూకశ్మీర్ LOC వెంబడి జవాన్లు సోదాలు చేపట్టారు. నిన్న రాత్రి 9.15 గం.లకు పాక్ 6 డ్రోన్లను LOC వెంబడి ఎగరేసినట్లు గుర్తించారు. మెందర్ సెక్టార్‌లోని బాలాకోట్, లంగోట్, గురుసాయ్ నల్లా ప్రాంతాల్లో ఈ డ్రోన్లను చూశారు. చాలా ఎత్తులో ఎగిరి తిరిగి పాక్‌లోకి వెళ్లాయని ఆర్మీ తెలిపింది. సర్వైలెన్స్ కోసం ఇలా చేసుంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజాము నుంచే అక్కడ తనిఖీలు చేస్తున్నారు.
వెంబడి డ్రోన్లు ఎగరేసిన పాకిస్థాన్
26
Aug