కేరళ కాంగ్రెస్ నేత తనకు అసభ్యకరమైన మెసేజ్లు పంపి హోటల్కు రమ్మన్నాడంటూ మలయాళ నటి రిని ఆన్ జార్జ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆమెను వేధించింది MLA రాహుల్ మమూటతిల్ అంటూ BJP ఆందోళన ఉద్ధృతం చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తూ పార్టీ నుంచి కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. పార్టీ ఒత్తిడితో అతడు అంతకుముందే కేరళ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు.
హోటల్కు రమ్మన్నాడన్న నటి.. MLA సస్పెండ్
26
Aug