కృతుంగా రెస్టారెంట్ బిర్యానీలో బొద్దింకలు

HYD LBనగర్ లోని కృతుంగా రెస్టారెంట్ బిర్యానీలో బొద్దింకలు కనిపించిన ఘటన కలకలం రేపింది. వనస్థలిపురానికి చెందిన సందీప్, తన స్నేహితులతో రెస్టారెంట్కి వెళ్లారు. ఆర్డర్ చేసిన బిర్యానీలో బొద్దింకలు రావడంతో అవాక్కయ్యారు. దీనిపై హోటల్ యజమానిని ప్రశ్నించగా ‘ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో. ఫుడ్ సేఫ్టీ వాళ్లు ఏం చేయలేరు’ అని దురుసుగా సమాధానం ఇచ్చినట్లు సందీప్ తెలిపారు. దీంతో అతడు మీడియాను ఆశ్రయించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *