ఈ నెల 17 వరకు వల్లభనేని వంశీకి రిమాండ్

AP: మాజీ ఎమ్మెల్యే, YCP నేత వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టు ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో CID అధికారులు కోర్టులో ఇవాళ పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో విజయవాడ సీఐడీ కోర్టు ఆయన్ను వర్చువల్గా విచారించి రిమాండ్ విధించింది. ఈ కేసులో వంశీ A71గా ఉన్న విషయం తెలిసిందే. సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో వంశీ ఇప్పటికే విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *