AP: అనంతపురం(D) బుక్కరాయసముద్రంలో నెల క్రితం అమ్మవారి హుండీ డబ్బు ఎత్తుకెళ్లిన దొంగలకు ఊహించని పరిణామం ఎదురైంది. ఉన్నట్టుండి వారి పిల్లలకు ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఎత్తుకెళ్లిన సొమ్ము (₹లక్షకుపైగా)తో పాటు ఓ లేఖ కూడా ఆలయం వద్ద పెట్టి వెళ్లారు. ఆ లేఖలో ‘చోరీ చేసిన తర్వాత మా పిల్లల ఆరోగ్యం క్షీణించింది. అందుకే డబ్బు తిరిగి వదిలేస్తున్నాం’ అని రాశారు. దీంతో గ్రామస్థులు, పోలీసులు ఆశ్చర్య పోయారు.
హుండీలో డబ్బు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే?
06
Sep