పులస చేప రూ.18,000!.. తగ్గుతున్న లభ్యత

AP: ‘పుస్తెలమ్మైనా పులస కొని తినాల్సిందే’ అని గోదావరి జిల్లాల్లో నానుడి ఉంది. అయితే సముద్ర జలాలు కాలుష్యమయంగా మారుతుండటంతో వీటి లభ్యత తగ్గుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ చేపలు హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతంలోకి చేరుతాయి. గోదావరికి వరద వచ్చే జులై నుంచి అక్టోబర్ మధ్యలో అవి సముద్రం నుంచి ఎదురీదుతూ నదిలోకి వస్తాయి. ఈ సీజన్లో యానాంలో కేజీ బరువు ఉన్న చేప రూ.18 వేల వరకు పలికింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *