క్రాస్ ఓటింగ్ నార్త్లో BJPకి కలిసొస్తే సౌత్లో దెబ్బకొట్టింది. నిన్న ఝార్ఖండ్లోని RS ఎన్నికల్లో ఓ స్థానంలో BJP మద్దతుదారుడు క్రాస్ ఓటింగ్తో గెలిచారు. అదే రోజు కర్ణాటకలో 7 MLC సీట్లకు జరిగిన పోలింగ్లో ఈ క్రాస్ ఓటింగ్తోనే BJP నష్టపోయింది.
ముగ్గురు BJP MLAలు, BJP మిత్రపక్షమైన JD(S) నుంచి ఆరుగురు, ఇద్దరు బీజేపీ బహిష్కృత నేతలు క్రాస్ ఓట్ చేసినట్లు సమాచారం. కాగా కాంగ్రెస్ 5 MLC సీట్లు గెలుచుకుంది.