గుజరాత్లోని ఆరావళిలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. మొదాసా-మల్పూర్ హైవేపై సకారియా బస్ స్టేషన్ సమీపంలో రెండు బస్సులు ఢీకొన్నాయి. స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సు డివైడర్ను దాటి వెళ్లి ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.
2 బస్సులు ఢీ.. ముగ్గురు మృతి
01
Jun