గుంతకల్లు మండలంలోని కసాపురం గ్రామంలో వెలసిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. ఈ సంధర్బంగా అర్చకులు శ్రీ స్వామి వారిని స్వర్ణకవచ అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. జయంతి సందర్భంగా వేలాదిగా భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు ఆలయంలో శ్రీ సీతారామ ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కళ్యాణం నిర్వహించారు.
వైభవంగా శ్రీ హనుమాన్ జయంతి
02
Jun