AP: సీఎం జగన్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి RK రోజా అన్నారు. ప్రజలు సంక్షేమం, అభివృద్ధికే పట్టం కట్టారని ఆమె చెప్పారు. ‘రాష్ట్రంలో కూటమికి ఎలాంటి క్రేజ్ లేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కూటమి ప్రయత్నిస్తోంది. ఎన్ని దొంగాటలు ఆడినా YCPని, జగన్ను ఏమీ చేయలేరు. కూటమి ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మనస్సుల్లో నుంచి జగన్ను చెరిపేయలేరు’ అని ఆమె పేర్కొన్నారు.
జగన్ రెండోసారి సీఎం కావడం ఖాయం: రోజా
03
Jun