AP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేతపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు శేషగిరిరావు కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల్ని ఉల్లంఘిస్తూ ఆఫీసుని కూల్చేశారని అన్నారు. సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ నిర్మల్ కుమార్ని ప్రతివాదులుగా పేర్కొన్నారు.
వైసీపీ ఆఫీసు కూల్చివేతపై హైకోర్టులో పిటిషన్
02
Jul