సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఈ నెల 9న మరో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రారంభం కానుంది. అయోధ్య, కాశీ, గయ, ప్రయాగరాజ్ తదితర పుణ్య క్షేత్రాలను కలిపేలా ఈ రైలు నడవనుంది. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కవచ్చు. స్లీపర్ టికెట్ ధర రూ.15,510, కంఫర్ట్ కేటగిరీ ధర రూ.31,500గా నిర్ణయించారు.
9న సికింద్రాబాద్ నుంచి మరో భారత్ గౌరవ్ రైలు
06
Jul