TG: హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం ధాటికి రోడ్లపై నీరు వరదను తలపిస్తోంది. పలు చోట్ల కార్లు, బైక్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. ముషీరాబాద్ పరిధిలోని ఓ వీధిలో వరద ఉద్ధృతిలో కారు చిక్కుకుపోయింది. డోర్లు ఓపెన్ కాకపోవడంతో నలుగురు వ్యక్తులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. దీన్ని గమనించిన స్థానిక యువకులు కారు అద్దాలు పగలగొట్టి వారిని బయటకు తీసుకొచ్చారు.
A