కొమురంభీం జిల్లా కేంద్రంలోని పీఎం తెలంగాణ మోడల్ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అందించే కేంద్ర ప్రభుత్వ ప్రతిభ ఉపకార వేతనాలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ అబ్దుల్ ఖలీల్ తెలిపారు. ఈ సంవత్సరం ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు మెరిట్ ఆధారంగా చోటు సాధించారని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.
ఉపకార వేతనాలకు 24 మంది విద్యార్థులు ఎంపిక
18
Jul