AP: గుంటూరు(D) తెనాలికి చెందిన పానీపూరీ వ్యాపారి మెఘావత్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 15న ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి ఆహ్వానం అందింది. మెఘావత్ చిరు వ్యాపారం కోసం జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ కింద మెప్మా రుణమిచ్చింది. బకాయిలు సకాలంలో చెల్లించడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంతో ఆయనకు ఆహ్వానం అందినట్లు అధికారులు తెలిపారు.
తెలుగు పానీపూరీ వ్యాపారికి రాష్ట్రపతి ఆహ్వానం
07
Aug