AP: మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్స్లో నిర్వహించిన వన మహోత్సవంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అక్కడ వీరిద్దరూ వేప, రావి చెట్లను నాటారు. రాష్ట్రంలో పచ్చదనం 50 శాతానికి పెరగాలని, ఏటా ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పచ్చదనం ఆవశ్యకతను విద్యార్థులు గ్రహించాలని సూచించారు. సహజ అందాలతో వచ్చే అనుభూతి ఎంతో సంతృప్తినిస్తోందని పవన్ అన్నారు.
ప్రతి ఒక్కరూ ఏటా 2 మొక్కలు నాటాలి: సీఎం చంద్రబాబు
31
Aug