AP: తిరుమల బ్రహ్మోత్సవాల ప్రారంభం ముందు అపశ్రుతి చోటు చేసుకుంది. ధ్వజస్తంభంపై ఇనుప కొక్కి విరిగింది. సాయంత్రం నిర్వహించే ధ్వజారోహణలో ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని ఈ కొక్కి ద్వారానే అర్చకులు ఎగుర వేయాల్సి ఉంది. అర్చకులు ఈ కొక్కిని ఏర్పాటు చేసే పనులు ప్రారంభించారు. కాగా తొమ్మిది రోజుల పాటు ధ్వజస్తంభంపై ఈ గరుడ పతాకాన్ని ఉంచుతారు. బ్రహ్మోత్సవాల ముగింపు చిహ్నంగా చివరి రోజు పతాకాన్ని అవనతం చేస్తారు.
తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభంలోనే అపశ్రుతి
04
Oct