AP: ‘పల్లె పండుగ’ కార్యక్రమం విజయవంతంగా సాగుతుండటం ఆనందం కలిగిస్తోందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. 13,326 గ్రామాలలో రూ.4,500 కోట్ల ఖర్చుతో 30 వేల అభివృద్ధి పనులు చేపట్టాలనే సంకల్పాన్ని డిప్యూటీ సీఎం పవన్ కార్య రూపంలోకి తీసుకువచ్చారని కొనియాడారు. ఇందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టి పల్లెల్లో సంతోషాలు నింపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు
15
Oct