AP: దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా జిల్లాల్లో ఎపిడెమిక్ సెల్లు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు పద్మావతి వెల్లడించారు. పునరావాస కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, ప్రసవానికి వారం ముందే గర్భిణులను ఆస్పత్రులకు తరలించాలన్నారు. ఏదైనా సమస్య ఎదురైతే రాష్ట్ర ఎపిడెమిక్ నంబర్ (9032384168)కు ఫోన్ చేయాలన్నారు
భారీ వర్షాలు.. వైద్యశాఖ అప్రమత్తం
15
Oct