AP: ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తారు. 1.18 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కృష్ణా నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నది దాటే ప్రయత్నాలు చేయరాదని పేర్కొంది. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు 2 లక్షల క్కూసెక్కులకు పైగా ఇన్ప్లే కొనసాగుతోంది.
కృష్ణా పరివాహక ప్రజలకు అలర్ట్
21
Oct