తెలంగాణలోని పలు జిల్లాలో కురిసిన అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. ఉమ్మడి మెదక్, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో మార్కెట్లలో ఆరబెట్టిన ధాన్యం నీటిపాలైంది. వరంగల్ లోని ఎనుమాముల మార్కెట్లో పత్తి తడిసిపోవడంతో రైతుల రోదనలు మిన్నంటాయి. తేమ శాతం ఎక్కువగా ఉందని తమ పంట కొనడం లేదని రైతులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
అకాల వర్షం.. రైతుకు తీరని నష్టం
01
Nov