తాను తెలుగు వారికి వ్యతిరేకంగా మాట్లాడానంటూ DMK పార్టీకి చెందిన వారు ఫేక్ ప్రచారం చేస్తున్నారని నటి కస్తూరి అన్నారు. తెలుగు గడ్డ తనకు మెట్టినిల్లుతో సమానమని, తెలుగు వాళ్లను కుటుంబ సభ్యులుగా భావిస్తానన్నారు. తన వ్యాఖ్యలను తమిళ మీడియాలో వక్రీకరించి చూపిస్తున్నారని ఆమె చెప్పారు. తెలుగు ప్రజల ప్రేమను తనకు దూరం చేసేందుకే కొందరు కుట్ర చేశారని పేర్కొన్నారు. ఆమె కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు
తెలుగు గడ్డ నా మెట్టినిల్లుతో సమానం: కస్తూరి
05
Nov