AP: చిత్తూరు(D) కేవీ పల్లి(M)లోని రెసిడెన్షియల్ పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థి రెడ్డి మోక్షిత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. అయితే తమ బిడ్డను అన్యాయంగా చంపేశారంటూ తల్లి కన్నీటిపర్యంతమయ్యారు. ‘నా బిడ్డది ఉరి వేసుకునే వయసా? ఇంత మంది టీచర్లు ఉండి ఓ పిల్లాడిని చూసుకోలేకపోయారు’ అంటూ రోదించడం అందరినీ కలచివేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నా బిడ్డను అన్యాయంగా చంపేశారు.. తల్లి కన్నీటి వేదన
11
Nov