TG: వికారాబాద్ జిల్లా కలెక్టర్, అధికారులపై దాడి ఘటనలో పోలీసులు అర్ధరాత్రి 28 మందిని అరెస్టు చేశారు. వారిని పరిగి PSకు తరలించినట్లు తెలుస్తోంది. దుద్యాల, బొంరాస్పేట, కొడంగల్ మండలాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దాడి జరిగిన లగచర్ల గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. నిన్న ఫార్మా పరిశ్రమకు భూసేకరణ కోసం వెళ్లిన అధికారులపై గ్రామస్థులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.
అధికారులపై దాడి.. 28 మంది అరెస్టు
13
Nov