AP: కర్నూలు(D) కృష్ణగిరి (M) పెనుమడ గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. స్టేజీపై పెళ్లి కుమారునికి గిఫ్ట్ అందించిన వెంటనే వంశీ అనే యువకుడు స్పృహ కోల్పోయాడు. కింద పడిపోతుండగా పక్కనే ఉన్న స్నేహితులు అతడిని పట్టుకున్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్ మరణాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
పెళ్లి వేడుకలోనే కుప్పకూలిన యువకుడు
23
Nov