వాణిజ్య యుద్ధంలో విజేతలు ఉండరు: చైనా

చైనాతో వాణిజ్యంలో ఆంక్షలు విధించాలని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్న నేపథ్యంలో చైనా స్పందించింది. వాణిజ్యంలో యుద్ధం వలన ఏ దేశానికీ లాభం ఉండదని అమెరికాలో చైనా ఎంబసీ అధికార ప్రతినిధి లియూ పెంగ్యూ వ్యాఖ్యానించారు. అది ఎవరూ గెలవని పోరు అని అభివర్ణించారు. చైనా-అమెరికా వాణిజ్య సహకారం పరస్పర లాభదాయకమని తాము భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *