AP: మామిడి బీమా ప్రీమియం చెల్లింపు గడువును వ్యవసాయ శాఖ ఈనెల 31 వరకు పొడిగించినట్లు ఏపీ కౌలు రైతు సంఘం తెలిపింది. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చింది. మామిడి సాగుదారులు, కౌలుదారుల పేరుతోనే ఈ క్రాప్ చేయాలని, ప్రీమియంలో రైతులు ఒక్క రూపాయి చెల్లిస్తే మిగిలిన మొత్తం ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు సంఘం అధ్యక్షుడు రాధాకృష్ణ వెల్లడించారు.
మామిడి బీమా ప్రీమియం చెల్లింపు గడువు పెంపు
19
Dec