తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా చేసేందుకు ఆమిర్ ఖాన్ అంగీకరించినట్లు ఓ వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. వరుసగా రెండు ఫ్లాపులు చవిచూసిన ఆమిర్, టాలీవుడ్ డైరెక్టర్తో పనిచేయాలని భావించినట్లు సమాచారం. ఇప్పటికే వంశీ స్టోరీ లైన్ చెప్పారని, ఆమిర్కు నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ తయారుచేసే పనిలో పడ్డారని తెలుస్తోంది. దిల్ రాజు నిర్మించే అవకాశం ఉన్న ఈ మూవీపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
తెలుగు డైరెక్టర్తో ఆమిర్ ఖాన్ సినిమా?
21
Dec