అల్లు అర్జున్ అరెస్టుపై ప్రశ్న.. పవన్ కళ్యాణ్ రియాక్షన్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కావడంపై డిప్యూటీ సీఎం పవన్కు ప్రశ్న ఎదురైంది. కడప పర్యటనలో భాగంగా మీడియాతో పవన్ మాట్లాడుతుండగా బన్నీ అరెస్టుపై స్పందించాలని ఓ విలేకరి అడిగారు. ‘ఇది సంబంధం లేని ప్రశ్న. మనుషులు చనిపోతే సినిమాల గురించి ఏం మాట్లాడుతాం? ఇంకా పెద్ద సమస్యల గురించి ప్రస్తావించండి. సినిమాను మించిన సమస్యలపై డిబేట్ పెట్టండి. అడగండి’ అని పవన్ అన్నారు.