AP: హీరో మంచు విష్ణు మంచి మనసు చాటుకున్నారు. తిరుపతిలోని బైరాగి పట్టెడలో మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నారు. వారికి విద్య, వైద్యం సహా అన్ని విషయాల్లో ఓ కుటుంబసభ్యుడిలా తోడుగా ఉంటానని తెలిపారు. వారితో కలిసి సంక్రాంతి పండుగ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇవాళ ఉదయం మోహన్బాబు యూనివర్సిటీలో నిర్వహించిన వేడుకల్లో విష్ణు పాల్గొన్నారు.
మంచు విష్ణు మంచి మనసు.. 120 మంది అనాథల దత్తత
15
Jan