యూపీ ప్రయాగ్జ్లో ఇవాళ మహాకుంభమేళా వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజే దాదాపు కోటి మంది పుణ్యస్నానాలను ఆచరించారు. 45 రోజులు సాగే ఈ మేళాకు యూపీ ప్రభుత్వం రూ.7వేల కోట్లు కేటాయించింది. మొత్తం 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. వసతి, రవాణా, ఫుడ్, ఇతరాలకు ఒక్కొక్కరు సగటున రూ.5వేలు ఖర్చు చేస్తే రూ.2లక్షల కోట్ల రెవెన్యూ జనరేట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇది మరింత పెరగొచ్చని పేర్కొంటున్నారు.
మహా కుంభమేళా: రూ.7వేల కోట్లకు రూ.2లక్షల కోట్ల రెవెన్యూ
15
Jan