తాను ఎప్పుడూ అభిమానులను ఎంటర్టైన్ చేయడానికే ప్రయత్నిస్తానని టీమ్ ఇండియా ప్లేయర్ హార్దిక్ పాండ్య అన్నారు. అభిమానులు టికెట్ కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి న్యాయం చేస్తానని చెప్పారు. ‘ప్రతి క్షణం ఆట కోసమే పరితపిస్తా. ఆట నాకు ఎన్నో తిరిగిచ్చింది. క్రికెటే నా జీవితం. నా తొలి ప్రేమ కూడా అదే. తొలి ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకమే’ అని పేర్కొన్నారు. ఇంగ్లండ్తో నాలుగో టీ20లో హార్దిక్ 53 రన్స్ బాదారు.
ఫ్యాన్స్ ప్రతి రూపాయికి న్యాయం చేస్తా: హార్దిక్
01
Feb