ఘోర ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్
AP: కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. పాండవగల్లు గ్రామ సమీపంలో ముందు వైపు వెళ్తున్న రెండు బైకులను బస్సు ఢీకొట్టడంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. కర్ణాటకలోని గంగావతి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదోని నుంచి రాయచూరుకు వెళ్తుండగా ఘటన జరిగింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు